ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) పెరుగుతున్నాయి. రోజుకోతరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి స్కామర్ల బారినపడి ఏకంగా రూ. లక్ష పైగా నష్టపోయాడు. సోషల్ మీడియాలో బిగ్‌బజార్ స్పెషల్ డిస్కౌంట్ యాడ్‌ను క్లిక్ చేసిన వ్యక్తి స్కామర్ల చేతిలో మోసపోయాడు. బిగ్‌బజార్ స్టోర్ పేరుతో 75 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన యాడ్‌పై ఢిల్లీకి చెందిన 28 ఏండ్ల వ్యక్తి క్లిక్ చేశాడు.
ఆపై నాలుగు వస్తువులను అతడు కొనుగోలు చేయగా అవి డెలివరీ కాలేదు. ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు బాధితుడు తన ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగించగా ఆపై అతడి డెబిట్ కార్డు హ్యాక్ కావడంతో రూ. లక్ష నష్టపోయాడు. ఫేస్బుక్ యాడ్‌పై తాను క్లిక్ చేసి ఐటెమ్స్‌ను కొనుగోలు చేయగా ఏ డెలివరీ ఏజెన్సీ వాటిని తనకు డెలివర్ చేయలేదని ఎఫ్ఐఆర్లో బాధితుడు వాపోయాడు.
అలిఖాన్, మాన్సూన్ ఆఫర్స్ పేరుతో ఇదే తరహా ఆఫర్లు ఫేస్బుక్లో కనిపించాయని, తన ఖాతా నుంచి డబ్బు డిడక్ట్ అయినట్టు తనకు మూడు టెక్ట్స్ మెసేజ్‌లు వచ్చాయని చెప్పాడు. తన డెబిట్ కార్డును హ్యాక్ చేసిన స్కామర్లు ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 40,000, రూ. 39,900, రూ. 40,000 చొప్పున లావాదేవీలు జరిపారని పేర్కొన్నాడు. డబ్బు డిడక్ట్ అయినట్టు టెక్ట్స్ మెసేజ్‌లు రావడంతో మోసపోయానని గ్రహించిన తాను వెంటనే తన డెబిట్ కార్డును బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు వివరించాడు.
Read More :
Telangana | ఒకే రోజు ఇద్దరు భార్యల మృతి.. శోకసంద్రంలో భర్త.. రంగారెడ్డి జిల్లాలో విషాదం