సంగారెడ్డి : నకిలీ పులి చర్మాన్ని అసలైందని నమ్మించి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని జిల్లాలోని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం పటాన్చెరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఒక వ్యక్తి ప్లాస్టిక్ సంచితో అనుమానస్పదంగా తచ్చాడుతూ పోలీసులకు కనిపించాడు.
పోలీసులు అతడిని తనిఖీ చేయగా అతడి వద్ద పులిచర్మం లభించింది. ఈ మేరకు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారించారు. విచారణలో అతడి పేరు మహ్మద్ సుజాత్ అలీ(37)గా గుర్తించారు. నకిలీ పులిచర్మం, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి కోర్టుకు తరలించారు.