ముంబై : మహారాష్ట్రలోని పుణే రెడ్‌లైట్ ఏరియా బుధవార్‌పేటలో దారుణం జరిగింది. డబ్బు వ్యవహారంలో వివాదం చెలరేగడంతో 35 ఏండ్ల సెక్స్ వర్కర్‌పై విటుడు (40) బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నిందితుడు రాజప్ప సిద్ధలింగప్ప మహిళ ఛాతీ కింద భాగంలో షేవింగ్ బ్లేడ్‌తో దాడి చేశాడని పోలీసులు తెలిపారు.
తనతో వచ్చేందుకు నిందితుడు ఇవ్వజూపిన మొత్తానికి మహిళ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు బాధితురాలిపై బ్లేడ్‌తో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదుతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.