భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. రెవా సర్క్యూట్ హౌస్‌లో 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన మహంత్ సీతారాం అలియాస్ సమర్ధ్ త్రిపాఠిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగ్రౌలి బస్‌స్టాండ్‌లో క్షురకుడి వద్దకు వెళుతుండగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన అతీంద్రియ శక్తులతో సమస్యలను పరిష్కరిస్తానని మహంత్ నమ్మబలికాడని బాధితురాలు తెలిపింది. బాలిక సన్యాసి గదిలోకి రాగానే ఆయన అనుచరులు బయట నుంచి తలుపు వేశారని వెల్లడించింది. ఆపై నిందితుడు తనచే బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఆపై బాలికను మరో ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు నిందితుడితో పాటు అతడి అనుచరులు ప్రయత్నించగా ఆమె వాహనం నుంచి దూకి పారిపోయింది. కాగా ఘటన అనంతరం భారీ మొత్తంలో నగదు, దుస్తులతో నిందితుడు నగరాన్ని విడిచిపెట్టి పరారయ్యాడని సివిల్‌లైన్ పోలీస్‌స్టేషన్ ఇన్ఛార్జ్ హెచ్ఎన్ శర్మ తెలిపారు. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కనిపించేందుకు బార్బర్ షాప్‌కు వెళతుండగా సింగ్రౌలి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.