శనివారం 16 జనవరి 2021
Crime - Jan 10, 2021 , 22:01:59

ట్రాక్టర్‌ను వాయువేగంతో ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

ట్రాక్టర్‌ను వాయువేగంతో  ఢీకొట్టిన లారీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

ఖమ్మం : వాయువేగంతో వచ్చిన లారీ రోడ్డు దాటుతున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ నుజ్జునుజ్జవగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మధిర పట్టణంలోని వైరా రోడ్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆత్కూరుకు చెందిన సీతారావమ్మ అనారోగ్యంతో మృతిచెందగా.. టెంట్‌ సామగ్రి తీసుకొచ్చేందుకు అదే గ్రామానికి చెందిన వెంకట్రామనర్సయ్య తన ట్రాక్టర్‌ తీసుకుని మధిరకు వచ్చాడు. వైరా రోడ్డుకు రాగానే సుబాబుల్‌ లోడ్‌తో వస్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్‌ను వాయువేగంతో ఢీకొట్టింది.

దీంతో ట్రాక్టర్‌ ఇంజిన్‌ సహా పల్టీ కొట్టింది. డ్రైవర్‌ వెంకట్రామనర్సయ్య తలకు బలమైనగాయమైంది. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మంకు తరలించారు. మద్యం మత్తులో లారీని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.