కొత్తూరు రూరల్ : కంటైనర్, సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొన్న సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలోని వై జంక్షన్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కంటైనర్ గుజరాత్ నుంచి చెన్నయ్‌కి వెళ్తుండగా కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలోని వై జంక్షన్ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి కొత్తూరు వైపు వెళ్తున్న సిమెంట్ మిక్సర్ లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెకకాల నుంచి వస్తున్న కంటైనర్ సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగం దెబ్బతిన్నది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవటంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.