తిరువనంతపురం : కూతురి కోసం వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్‌ను దొంగగా భావించి కత్తితో నరికి చంపాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
లాలన్ అనే వ్యక్తికి ఓ కూతురు ఉంది. ఆమెకు ఆనీష్ జార్జ్(19) అనే యువకుడితో పరిచయం ఉంది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు లాలన్ కూతురిని చూసేందుకు జార్జ్ ఆమె ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి అతను ప్రవేశించడాన్ని లాలన్ గమనించాడు. అతన్ని దొంగగా భావించిన లాలన్.. క్షణం ఆలోచించకుండా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం లాలన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఆనీష్ జార్జ్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.