Jcb theft | బండ్లగూడలో జేసీబీని దొంగిలించిన దుండగులు

చాంద్రాయణగుట్ట : జేసీబీ చోరీ అయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడు సయ్యద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 1న బండ్లగూడ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో రోజు మాదిరిగానే సయ్యద్ అలీ తన జేసీబీ టీఎస్11ఈఎం8127 పార్కు చేసి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు.
మరుసటి రోజు వచ్చి చూస్తే పార్కింగ్ స్థలంలో జేసీబీ కనిపించలేదు.చూట్టుపక్కల బస్తీల్లో వెతికినా ఆచూకీ తెలియపోవడంతో ఈ నెల 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై పోలీసులను ఆరా తీయగా జేసీబీ చోరీ అయినమాట నిజమేనని వెల్లడించారు.
సీసీ పుటేజీలో ఓ వ్యక్తి జేసీపీని చోరీ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయని, త్వరలోనే జేసీబీ ఆచూకీ తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

