లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత అరెస్ట్
లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై పిర్యాదు ఆధారంగా బీజేపీ నేత మహ్మద్ సిద్ధిక్ ఖాన్, ఆయన అనుచరుడు షాహిద్ అహ్మద్ భట్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో స్ధానిక కోర్టు కొకెర్నాగ్ పోలీసులను ఆదేశించింది.
శ్రీనగర్ : లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్ ఆరోపణలపై పిర్యాదు ఆధారంగా బీజేపీ నేత మహ్మద్ సిద్ధిక్ ఖాన్, ఆయన అనుచరుడు షాహిద్ అహ్మద్ భట్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో స్ధానిక కోర్టు కొకెర్నాగ్ పోలీసులను ఆదేశించింది.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపిస్తూ తల్లీ కూతుళ్లు నిందితులపై చర్యలు చేపట్టాలని కోరుతూ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదిదారులు లేవనెత్తిన నేరాల తీవ్రత ఆధారంగా ఈ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోర్టు అభిప్రాయపడింది. ఆపై బాధితుల ఫిర్యాదు కాపీని, కోర్టు ఉత్తర్వులను కొకెర్నాగ్ పోలీస్ స్టేషన్‌కు పంపారు.
కోర్టు ఆదేశాలతో నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు నిందితులు మహ్మాద్ సిద్ధిక్ ఖాన్, ఆయన అనుచరుడు షాహిద్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. నిందితులు సమాజంలో పలుకుబడి కలిగిన వారని..ఆధారాలను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్న క్రమంలో బాధితులకు న్యాయం చేసేలా దర్యాప్తు సాగాలని ఉత్తర్వుల్లో న్యాయస్ధానం స్పష్టం చేసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

