ఎంబీబీఎస్ విద్యార్థిని మెడకోసి హత్య చేసిన ఐటీ ఉద్యోగి
MBBS student murder | గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఎంబీబీఎస్ విద్యార్థి హత్యకు గురైంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకున్నది. సర్జికల్ బ్లేడ్‌తో యువతి మెడపై కోసి హత్య చేశాడు. నిందితుడిని విజయవాడకు
అమరావతి : గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఎంబీబీఎస్ విద్యార్థి హత్యకు గురైంది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకున్నది. సర్జికల్ బ్లేడ్‌తో యువతి మెడపై కోసి హత్య చేశాడు. నిందితుడిని విజయవాడకు చెందిన ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతి కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాడి చేశాక జ్ఞానేశ్వర్ సైతం చేయి కేసుకోగా.. అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు జ్ఞానేశ్వర్, మృతురాలికి రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు విద్యార్థిని స్నేహితురాలు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా మృతురాలు స్నేహితురాలి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలోనే మృతురాలి స్నేహితురాలు జ్ఞానేశ్వర్, మృతురాలి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సోమవారం పిలిచింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్‌తో యువతి మెడపై దాడి చేసి మరో గదిలోకి ఈడ్చుకు వెళ్లి తలుపులు బిగించాడు. యువతితో పాటు ఆమె స్నేహితురాలు కేకలు వేయడంతో స్థానికులు గది తలుపులు పగులగొట్టి యువతి ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

