విదేశీ విద్య కోసం లండన్ వెళ్లిన భారతీయురాలిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. ఈ ఘటన యూకే రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఈస్ట్ లండన్‌లో హైదరబాదీ వాలా అనే రెస్టారెంట్ ఉంది. దానిలో పార్ట్ టైమ్ వెయిటర్‌గా సోనా బిజు అనే కేరళ యువతి పనిచేస్తోంది. అలా పని చేసే క్రమంలోనే శ్రీరామ్ అంబర్ల అనే కస్టమర్ వచ్చాడు.
అతని దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలోనే శ్రీరామ్.. కత్తితో సోనాపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అంబులెన్సు తీసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెనుద గ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స పొందుతోందని పోలీసు శాఖ తెలిపింది. సోనా ప్రాణానికి ముప్పు తప్పిందని, ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని వివరించారు.
శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగానే 23 ఏళ్ల శ్రీరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి లండన్‌లో స్థిర నివాసం ఏదీ లేదని దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 25న కోర్టు హియరింగ్ వరకు అతనికి రిమాండ్ విధిస్తున్నట్లు థేమ్స్ మెజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. శ్రీరామ్ ఎందుకు దాడి చేశాడు? సోనాతో అతని బంధం ఏమిటి? వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలియజేశారు.