కాలేజ్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని తపించాడు… ఆమె భర్తను హత్య చేశాడు
ముంబై: కాలేజ్ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఒక వ్యక్తి తపించాడు. నిరాకరించడంతో ఆమెను వేధించాడు. చివరకు ఆమె భర్తను హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శాంతాక్రూజ్‌లోని గోలీబార్ నగర్లో నివాసం ఉంటున్న అకీల్ సయ్యద్, షాజహాన్ అనే మహిళ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించాడు. ఒకవేళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె భర్తను హత్య చేస్తానని కూడా బెదిరించాడు. అయితే అతడి మాటలు, బెదిరింపులను షాజహాన్ పట్టించుకోలేదు. అనంతరం థానేలో రోల్డ్ గోల్డ్ ఆభరణాల వ్యాపారం చేసే పర్వేజ్ బషీర్ షేక్‌తో ఆమెకు వివాహం జరిగింది.
కాగా, సయ్యద్‌కు కూడా పెళ్లి అయ్యింది. అయినప్పటికీ తనను పెళ్లి చేసుకోవాలని షాజహాన్‌ను వేధించసాగడు. దీంతో ఆమె ఈ విషయాన్ని భర్త పర్వేజ్‌కు చెప్పింది. దీనిపై వారిద్దరి మధ్య ఒకసారి గొడవ కూడా జరిగింది. అయినప్పటికీ తన భార్యను సయ్యద్ వేధిస్తుండటంతో మరోసారి మాట్లాడేందుకు శుక్రవారం సాయంత్రం ఖార్ సబ్వే వద్ద వారిద్దరూ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి పోట్లాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పర్వేజ్‌ను కత్తితో సయ్యద్ పలుమార్లు పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పర్వేజ్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు అక్కడ చనిపోయాడు.
మరోవైపు మృతుడి భార్య షాజహాన్ ఫిర్యాదుతో వకోలా పోలీస్ స్టేషన్ పోలీసులు సయ్యద్‌పై హత్య కేసు నమోదు చేశారు. అతడు బంద్రా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి శనివారం అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

