లక్నో : యూపీలోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. పంట పొలంలో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానించారు. మృతురాలిని సమీప గ్రామానికి చెందిన కుంకుమ్‌గా గుర్తించారు.మంగళవారం ఉదయం పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన మహిళ మధ్యాహ్నానికి కూడా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు.
పంటపొలంలో అర్ధనగ్నంగా పడిఉండగా గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ దుస్తులు చిరిగిఉండటం, చెల్లాచెదురుగా పడిఉండటంతో హత్యాచారం జరిగిఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.