లక్నో : తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళపై కాల్పులకు తెగబడిన వ్యక్తి ఉదంతం ఆగ్రాలోని ఇత్మదుల్లా ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. నిందితుడిని దేవ్ గుర్జర్‌గా గుర్తించారు. పొరుగింటి టెర్రస్‌పై నుంచి దేవ్ మహిళ ఇంట్లోకి ప్రవేశించి బాధితురాలు ఉమాపై కాల్పులు జరిపాడు.
నిందితుడు గన్‌తో ఆమె తలపై బలంగా కొట్టి పరారయ్యాడు. మహిళ అరుపులు విన్న కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
బాధితురాలిపై పీకల్లోతు ప్రేమలో మునిగిన నిందితుడు ఆమెకు ప్రపోజ్ చేయగా నిరాకరించింది. తనను ప్రేమించడం లేదనే కోపంతో పగతీర్చుకునేందుకు నిందితుడు ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.