గువహటి : కజిన్ బాయ్‌ఫ్రెండ్ జరిపిన కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మరణించిన ఘటన అసోం రాజధాని గువహటిలోని బసిస్ట ప్రాంతంలో వెలుగుచూసింది. బాధితుడు ప్రేమ్ కుమార్ దేవ్‌నాధ్ బుల్లెట్ గాయాలతో గువహటి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
ఈ కేసులో నిందితుడు బెంగాల్ నుంచి ఇటీవల గువహటి చేరుకుని తన గర్ల్‌ఫ్రెండ్ కజిన్ అయిన బాధితుడితో వాగ్వాదానికి దిగాడు. పట్టరాని కోపంతో దేవ్నాధ్పై కాల్పులకు తెగబడటంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ గొడవలతోనే వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
యువతితో సోషల్ మీడియా వేదికగా పరిచయం పెంచుకున్న నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు గురిచేసినట్టు వెల్లడైంది. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సమయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.