చెన్నై : బాలికపై కజిన్ సహా పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురం సమీపంలో కున్నత్తూర్ వద్ద వెలుగుచూసింది. కజిన్‌తో పాటు అతడి తొమ్మది మంది స్నేహితులు తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. స్కూల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బయటపడింది.
నిందితుల తీరుతో విసిగిన బాలిక స్కూల్లో నిస్తేజంగా ఉంటుండటంతో గమనించిన స్కూల్ అధికారులు ఏం జరిగిందని ప్రశ్నించారు. తమ అంకుల్ కుమారుడు శశి తాను ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాలిక పేర్కొంది. కజిన్ తొమ్మిది మంది స్నేహితులు కూడా తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని వివరించింది.
టీచర్ స్కూల్ ప్రిన్సిపల్‌కు సమాచారం ఇవ్వడంతో ప్రిన్సిపల్ డీఈఓకు తెలపగా ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ముందియంబాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విల్లుపురం పోలీసులు నిందితుడు శశితో పాటు అతడి స్నేహితులు మణికందన్, వినాయకమూర్తిని అరెస్ట్ చేశారు. నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.