జైపూర్ : ఎంతో భవిష్యత్ ఉన్న ఇంజనీరింగ్ విద్యార్ధి అర్ధంతరంగా తనువు చాలించిన ఘటన జైపూర్‌లో గురువారం వెలుగుచూసింది. నగరంలోని శివదాస్‌పూర్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనం ఎనిమిదో ఫ్లోర్ నుంచి కిందకు దూకిన 25 ఏండ్ల టెకీ మరణించాడు.
మృతుడిని బిహార్‌కు చెందిన వివేక్ కుమార్‌గా గుర్తించారు.వివేక్ ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్లాట్‌లో నివసిస్తున్న కుమార్ కిందపడిపోయేముందు ఫోన్లో మాట్లాడాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రాధమిక ఆధారాలను బట్టి ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కుమార్ రూం నుంచి బయటకు వచ్చి కారిడార్లోకి వెళ్లిన సమయంలో అతడి స్నేహితులు నిద్రిస్తున్నారు.