ముంబై : భార్యను అభాసుపాలు చేసేందుకు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్తను ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో మహిళా కానిస్టేబుల్‌కు నిందితుడితో వివాహం కాగా వారికి ఓ బిడ్డ జన్మించింది. వారి వివాహమైన నెలరోజుల తర్వాత మహిళా కానిస్టేబుల్ ముంబై చేరుకుని విధుల్లో చేరింది.
ఆమె భర్త పుణేలోనే ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మహిళ ప్రతినెలా పుణేలోని భర్త వద్దకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆమె నగ్నచిత్రాలను పంపాలని మహిళను భర్త ఒత్తిడి చేశాడు. భర్త విసిగిస్తుండటంతో ఆమె తన అభ్యంతరకర చిత్రాలను వాట్పాప్‌లో పంపింది.
ఆపై భర్త వారించినా వినకుండా కూతురిని తనతో పాటు ముంబైకి తీసుకువెళ్లడంతో ఆగ్రహానికి లోనైన భర్త ఆమె నగ్న చిత్రాలు గతంలో ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో సాగించిన సంభాషణల మెసేజ్‌లను ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. భార్య ఫిర్యాదు ఆధారంగా మెరైన్ డ్రైవ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.