బెంగళూర్ : అందంగా లేవని స్వయంగా కట్టుకున్న భర్తే తరచూ హేళన చేస్తుండటంతో తీవ్ర మనస్ధాపానికి లోనైన మహిళ (32) ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించిన ఘటన బెంగళూర్‌లోని డీజే హళ్లి ప్రాంతంలో వెలుగుచూసింది. మృతురాలు భర్త నిజాముద్దీన్‌తో కలిసి నివసిస్తోంది.
ఎప్పటిలానే సోమవారం భార్య అనిషాను అందంగా లేవని అవహేళన చేశాడు. భర్త చేష్టలతో విసిగిన అనిషా అదేరోజు మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఇంటి నుంచి మంటలు రేగడంతో ఇరుగుపొరుగు వారు మంటలు ఆర్పి బాధితురాలిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మంగళవారం మరణించింది. అనీషా కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై భర్త నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.