హైదరాబాద్ : పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ పబ్‌పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడులు చేశారు. ఆ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు శనివారం దాడులు చేసి, ఏడుగురు యువతులు సహా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులు అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. క్లబ్ యజమాని, మేనేజర్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.