బిహార్: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రంలోని చప్పా-సివాన్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
లోక్ నాయక్ జయప్రకాశ్ 120వ జయంతిని పురస్కరించుకొని ఆయన జన్మస్థలం సిబాత్ దియారా ప్రాంతంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి పలువురు పోలీసులు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న బస్సును బైక్ బలంగా ఢీ కొట్టింది. ఈ క్రమంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం బైక్ బస్సు కిందకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఇంధన ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయిన మరో వ్యక్తి సజీవదహనమయ్యాడు.
మృతులు బిహార్ రాష్ట్రం పంచ్బింద గ్రామానికి చెందిన మాంజీ (22), బుల్బుల్ మాంజీ (25), కిషోర్ మాంజీ (24) గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
दर्दनाक हादसा..अमित शाह की रैली से लौट रही पुलिस बस ने छपरा में बाइक सवार को मारी टक्कर, तीन की मौत pic.twitter.com/GnzamLoUS6
— Nitish chandra (@NitishIndiatv) October 12, 2022