హైదరాబాద్ : మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారుతున్న పబ్, హుక్కా సెంటర్లపై సీసీఎస్ పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లో సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించి, ఓ హుక్కా సెంటర్ను సీజ్ చేశారు. ఆ సెంటర్లో ఉన్న సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హుక్కా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఇంట్లోనే హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.