తిరువనంతపురం : మహిళపై లైంగిక దాడి, వేధింపుల కేసులో నటుడు విజయ్ బాబుకు కేరళ హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని విజయ్ బాబు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని మళయాళ నటి విజయ్ బాబుపై పిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జస్టిస్ బెచు కురియన్ థామస్తో కూడిన ఏకసభ్య ధర్మాసనం నటుడికి బెయిల్ మంజూరు చేసింది.
జూన్ 2న ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టనున్నారు. సినీ పరిశ్రమలో మెరుగైన అవకాశాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ విజయ్ బాబు ఎర్నాకుళంలోని ఆయన ఫ్లాట్లో తన అంగీకారం లేకుండా తనపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు.
తన ఇష్టంతో నిమిత్తం లేకుండా శారీరక సుఖం కోసం తన శరీరాన్ని ఉపయోగించుకున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫేస్బుక్ వేదికగా బాధితురాలు విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా ఆమె తనను వేధించిందని, తానే బాధితుడినని ఏప్రిల్ 26న ఫేస్బుక్ లైవ్లో నటుడు విజయ్ బాబు మహిళ ఆరోపణలను తోసిపుచ్చారు.