గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్
Gas Tanker | అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తాలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్యాంకర్ అడ్డంగా బోల్తా పడటంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ ట్యాంకర్ విజయవాడ
రంగారెడ్డి : అబ్దుల్లాపూర్‌మెట్ చౌరస్తాలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్యాంకర్ అడ్డంగా బోల్తా పడటంతో.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గ్యాస్ ట్యాంకర్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో గ్యాస్ లీక్ అవుతుందేమోనన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడ్డ ట్యాంకర్‌ను తొలగిచేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో అటు వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

