యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామంలోని సాయిధామం పీఠాధిపతి రామానందను గురువారం రాత్రి బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
సాయిధామం అనాథాశ్రమంలో ఉన్న ఓ బాలిక పట్ల 2016, 2018 సంవత్సరంలో లైంగికంగా వేధించడాని సదరు బాలిక సీపీ మహేష్ భగవత్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు రామానందను పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం భువనగిరి కోర్టుకు తరలించారు.