రాంపూర్ : వైద్యుడిని దేవుడితో పోల్చి గౌరవించే సమాజంలో ఓ వైద్యుడు కామాంధుడై సహచరిని వేధించాడు. నర్సు స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను రికార్డు చేసిన డాక్టర్ తన కోరిక తీర్చాలని ఆమెను బ్లాక్మెయిల్ చేసిన ఘటన యూపీలోని రాంపూర్ జిల్లా షాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వెలుగుచూసింది. ఈ వీడియో క్లిప్‌ను డాక్టర్ తన భర్తకు చూపడంతో ఆయన తనకు విడాకులిచ్చాడని బాధితురాలు ఆరోపించింది.
మరోవైపు డాక్టర్‌తో నర్సుకు వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని చెప్పారు. నిందితుడి భార్య కూడా డాక్టర్ కాగా పదిరోజుల కిందట వీరు షాబాద్ నుంచి మొరదాబాద్ జిల్లా దవాఖానకు బదిలీ అయ్యారని, అన్నికోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.