వికారాబాద్ : మతిస్థిమితం లేని ఓ బాలికపై సర్పంచ్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నంద్యానాయక్ తండాలో చోటు చేసుకుంది. నంద్యా నాయక్ తండా సర్పంచ్ శంకర్ ఇంటికి ఓ బాలిక టీవీ చూసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సర్పంచ్.. మతిస్థిమితం లేని బాలికను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
అయితే సర్పంచ్ ఇంటికి వెళ్లిన తమ బిడ్డ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. శంకర్ ఇంటికి వెళ్లారు. అతను ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్న క్రమంలోనే.. బాలిక కుటుంబ సభ్యులు ఇంటిపైకి వెళ్లారు. సర్పంచ్ శంకర్‌ను బంధించి, దేహశుద్ధి చేశారు. అనంతరం సర్పంచ్ పరారీ అయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.