భోపాల్ : వదిన సోదరిని పెండ్లి పేరుతో లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడి ఆపై ముఖం చాటేసిన యువకుడి ఉదంతం భోపాల్లోని తీలా జమాల్పుర ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్దినెలల కిందట అక్క గర్భం దాల్చడంతో సాయం చేసేందుకు బాలిక (16) అక్క ఇంటికి వెళ్లింది.
బిడ్డకు జన్మనిచ్చే రోజు బాధితురాలు అక్కను ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికపై అక్క మరిది (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు దారుణానికి ఒడిగట్టాడు. కొద్ది రోజుల తర్వాత పెండ్లి చేసుకునేందుకు నిందితుడు నిరాకరించడంతో బాలిక జరిగిన విషయం తల్లితండ్రులకు తెలిపింది.
బాలికను వివాహం చేసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు నచ్చచెప్పగా నిందితుడు వారిని బెదిరించాడు. మైనర్ బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని, ఇంటి నుంచి పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.