Thieves arrested | బంగారు ఆభరణాలు దోచుకున్న ముఠా అరెస్ట్

దోమలగూడ : వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ముగ్గురు సభ్యుల ముఠాను గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనికి సంబంధించి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఐ మోహన్ రావు, డీఐ ప్రమోద్ కుమార్‌తో కలిసి వివరాలను వెల్లడించారు.
గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ కాలనీలో ఇల్లు అద్దెకు కావాలని వచ్చిన వ్యక్తులు శోభ అనే వృద్ధురాలు మెడలో నుంచి 9తులాల రెండు బంగారు గొలుసులను దోచుకుపోయారు. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దోపిడి చేసిన వ్యక్తులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కనుగొన్నారు.
దీంతో పాటు బాధితురాలి ఇంట్లో సహాయకుడిగా పని చేస్తున్న కావేటి రాజు పై పోలీసులకు అనుమానం వచ్చి, అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను తమ ఇద్దరు మిత్రులు సాయి గౌడ్, దినేష్ కుమార్‌తో కలిసి దోపిడికి పాల్పడ్డట్లు అంగీకరించారు.
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సాయి గౌడ్, దినేష్ కుమార్‌ను వారు వాడిన ద్విచక్ర వాహనం ఆధారంగా కనుగొని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడికి గురైన సొమ్ముతో పాటు వారు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ రావు తెలిపారు. నిందితులపై 394 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

