కరీంనగర్లో కాల్పుల కలకలం.. ఉలిక్కి పడ్డ ప్రజలు?
కరీంనగర్లో కాల్పుల కలకలం.. ఉలిక్కి పడ్డ ప్రజలు? కరీంనగర్ నగర కేంద్రంలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కాల్పులు ...

కరీంనగర్: కరీంనగర్ నగర కేంద్రంలోని ఓ ఇంటిలో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన కాల్పులు జరిగినట్లు తెలుస్తున్నది. దీంతో కరీంనగర్లో కలకలం రేగింది. దీంతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నగరంలోని లక్ష్మీ నగర్లోని ఓ ఇంటిలో ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి.
ఆస్తులన్నీ పెద్ద అన్న పేరుపైనే ఉన్నాయి. దీంతో పెద్దన్న బంధువులు.. మిగతా వారిని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పెద్ద అన్నపై మిగతా నలుగురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం మాట్లాడుకుందామంటూ చర్చలకు దిగారు.
సాయంత్రం ఇంటి వద్దే మాట్లాడుకుందామని చెప్పిన పెద్దన్న అస్గర్.. తన తమ్ముడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తున్నది.
కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్గర్ హుస్సేన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కాల్పులు జరిగినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Firing
- karim nagar
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

