ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకో స్కామ్‌తో స్కామర్లు అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. లేటెస్ట్గా నవీ ముంబైకి చెందిన 56 ఏండ్ల వ్యక్తి నుంచి ఇన్స్టంట్ లోన్ (Instant Loans) ఇస్తామని మభ్యపెడుతూ ఆన్లైన్ నేరగాళ్లు రూ. 90,000 దండుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెండు గంటల్లో ఇన్స్టంట్ లోన్స్ ఆఫర్ చేస్తామనే పోస్ట్‌ను ఫేస్బుక్లో చూశాడు.
తన కూతురు విద్యాభ్యాసానికి రుణం కోసం అన్వేషిస్తుండగా ఫేస్బుక్ పోస్ట్ అతడి దృష్టిని ఆకర్షించింది. పోస్ట్‌లో పేర్కొన్న ఫైనాన్స్ కంపెనీకి ఆన్లైన్లో రుణం కోసం నవంబర్ 8న అప్లై చేశాడు. కంపెనీ ప్రతినిధిగా పేర్కొంటూ అతడికి కొద్దిసేపటికే ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. తనకు రుణం అందిస్తామని, అయితే ఇన్సూరెన్స్ చార్జీలు, జీఎస్టీ, ఎన్ఓసీ చార్జీలు, ఆర్బీఐ చార్జీల కింద కొంత మొత్తం చెల్లించాలని, రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను ముందస్తుగా చెల్లించాలని కోరాడు.
ఈ మొత్తం దాదాపు రూ. 90,000ను బాధితుడు చెల్లించాడు. ఆపై ఎంతకీ బాధితుడికి రుణ మొత్తం అందలేదు. కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా మరికొంత చెల్లించాలని కోరడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Retail Market | దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ.. రూ.3.75 లక్షల కోట్ల అమ్మకాలు