అమరావతి : ఏపీలోని పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థితో ( Engineering student )పాటు మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు బీచ్ ( Madanoor Beach ) లో ఆదివారం సెలవుదినం కావడంతో ఇద్దరు విద్యార్థులు స్నానానికి వెళ్లారు. వీరిలో ఒకరు నీట మునిగి చనిపోగా మరొకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతి చెందిన విద్యార్థి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న హర్షగా గుర్తించారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఉమారామలింగేశ్వర ఆలయ పుష్కరణిలో పడి ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి రాగా స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించారు.