Stabbing | ఢిల్లీ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థి (19) పై క్యాంపస్ లోని ఆర్యభట్ట కాలేజీ బయట జరిగిన దాడిలో కత్తిపోట్లకు గురయ్యాడు. పొలిటికల్ సైన్స్‌లోని బీఏ (హానర్స్) కోర్సులో చేరాడు. బాధితుడు ఢిల్లీలోని పశ్చిమ విహార్ వాసి అయిన నిఖిల్ చౌహాన్ అని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడటంతో నిఖిల్ చౌహాన్ చికిత్స కోసం చరాక్ పాలికా దవాఖానలో చేరాడని పోలీసులు చెప్పారు. తమ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిఖిల్ చౌహాన్ స్నేహితురాలిపై ఒక విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడని తేలిందన్నారు.
ఆదివారం మధ్యాహ్నం సదరు నిందితుడితో కలిసి ముగ్గురు వ్యక్తులు ఆర్యభట్ట కాలేజీ వద్దకు వచ్చి చౌహాన్ ను కలిసి కత్తితో పొడిచారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీలతో నిందితుడ్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి టీం ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజా స్పందిస్తూ.. ఢిల్లీలో శాంతిభద్రతలు దిగజారాయని, ఢిల్లీ కోసం ఏం చేస్తారని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను ప్రశ్నించారు. ఢిల్లీలో శాంతి భద్రతల అంశం లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆధీనంలోనే ఉంటుంది.