న్యూఢిల్లీ : నలుగురు విదేశీయుల నుంచి రూ 42 కోట్ల విలువైన 85.5 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోల్టెన్ మెటల్ ఆపరేషన్లో భాగంగా చత్తార్పూర్, గుర్గావ్లో పలు ప్రాంతాల్లో డీఆర్ఐ అధికారులు శుక్రవారం చేపట్టిన దాడుల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు విదేశీయులను డీఆర్ఐ అధికారులు ప్రశ్నిస్తున్నారని ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. యంత్ర పరికరాల రూపంలో దేశంలోకి స్మగుల్డ్ అవుతున్న బంగారాన్ని ఆపై మెల్ట్ చేసి బార్లుగా మారుస్తూ స్ధానిక మార్కెట్లకు తరలిస్తుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణ ఢిల్లీ, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న ఫాం హౌస్లు, అపార్ట్మెంట్లలో విదేశీయులు ఈ దందాను మూడోకంటికి తెలియకుండా చేపడుతున్నారని తెలిపాయి.