న్యూఢిల్లీ: కొందరు వ్యక్తులు ఒక పోలీస్‌ను చుట్టుముట్టారు. అందులోని ఒకరిద్దరు ఆయనను కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. సుమారు 10-12 మంది వ్యక్తులు ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్‌ను చుట్టుముట్టారు. ఒక వ్యక్తి ఆయనపై దాడి చేశారు. ఒక చేతితో పోలీస్ యూనిఫామ్ చొక్కా కాలర్ పట్టుకుని మరో చేతితో ఆయన చెంపపై కొట్టాడు. అయితే క్షమించాలంటూ ఆ కానిస్టేబుల్ వారిని ప్రాధేయపడ్డాడు. కాగా, ఆ వ్యక్తులు కానిస్టేబుల్‌ను ఎందుకు కొట్టారు, ఆయన ఎందుకు వారిని ప్రాధేయపడ్డాడు అన్నది తెలియలేదు. అక్కడున్న మిగతా పోలీసులు కూడా దీనిపై జోక్యం చేసుకోలేదు.
మరోవైపు కొందరు పోలీసులతోపాటు ఆ గ్రూప్‌లోని వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డు చేశారు. దీంతో ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పోలీస్ కానిస్టేబుల్‌ను కొట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరకు ఇది పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Delhi: A viral video shows some people beating up the head police constable inside Anand Vihar Police Station in Shahdara
Preliminary probe shows that the video is of 31st July & now legal action is being taken against it: Delhi Police official
(Note: Strong language) pic.twitter.com/5oC7UGsNQZ
— ANI (@ANI) August 6, 2022