ఖమ్మం: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగీ ప్రసాద్‌కు పదేండ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమాన విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి పి. చంద్రశేఖర్ ప్రసాద్ సోమవారం తీర్పు ఇచ్చారు. ప్రాసీక్యూషన్ కథనం ప్రకారం 2016 జనవరి 5న భద్రాచలం పోలీసులు తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం నుంచి భద్రాచలం వచ్చే ఎపీ.ఎస్.ఆర్.టిసీ బస్సును కూనవరం రోడ్డు, భద్రాచలం దగ్గర బస్సు ఆపి తనిఖీ చేయగా నిందితుడు దగ్గర 50కేజీల గంజాయిని 9 బండిల్స్‌గా చేసి రెండు కవర్లలో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితులపై చార్జీషీట్ దాఖలు చేశారు.
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువైందని భావిస్తూ తీర్పుచెప్పారు. ఇదే కేసులో మిగతా ఇద్దరి నిందితులపై నేరం రుజువుకానందున వారిపై ఉన్నకేసును కొట్టివేశారు.