చండీఘఢ్ : పంజాబ్లో దారుణం జరిగింది. దళిత జంటను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించడంతో పాటు మహిళ, ఆమె కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఫజిల్కా జిల్లాలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. ఆగస్ట్ 27న గ్రామానికి చెందిన కొందరు దళిత జంటను, వారి కూతరును చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కేసు విషయంపై సమాచారం అందుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎస్పీలకు నోటీసులు పంపింది. దళిత కుటుంబంపై దాష్టీకానికి పాల్పడిన ఉదంతంపై నిగ్గుతేల్చాలని కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.