శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Crime - Jul 07, 2020 , 11:17:32

భడోహి ఎన్‌కౌంటర్‌లో క్రిమినల్‌ హత్య

భడోహి ఎన్‌కౌంటర్‌లో క్రిమినల్‌ హత్య

భడోహి : భడోహిలో సోమవారం రాత్రి నేరస్తులు, ఉత్తర ప్రదేశ్ పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కీలక నేరస్తుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ నేరస్తుడి తలపై ప్రభుత్వం రూ.50వేల రివార్డు కూడా ప్రకటించింది.  ఒకరు అక్కడికక్కడే చనిపోగా ఇంకో నేరస్తుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఆతడి కోసం గాలిస్తున్నారు. 

ఈ పరస్పర దాడుల్లో ఒక పోలీస్‌ కూడా గాయపడ్డాడు. తమను చూడగానే నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, కుదరక పోవడంతో తమపై కాల్పులు జరిపారని దీంతో మేము కూడా తిరిగి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసు అధికారుల్లో ఒకరు తెలియజేశారు. చనిపోయిన నేరస్తుడు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌లో ఒకరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకొక నేరస్తుడు తప్పించుకున్నాడని అతడి  కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని ఆయన పేర్కాన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo