కొత్తూరు : రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. కొత్తూరు, హెబీఎల్ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి 12గంటల సమయంలో ఓ మహిళ (30)ను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.