యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్‌పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్‌పై ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి సుమారు 40 సంవత్సరాల వరకు ఉంటాయని, అతను బూడిద రంగు ప్యాంట్ ధరించగా, షర్ట్ పూర్తిగా చినిగిపోయిందన్నారు.
షర్ట్ కాలర్‌పై సూపర్ టైలర్స్ బెల్లంపల్లి, ప్యాంట్‌పై డాల్ఫిన్ టైలర్స్ బెల్లంపల్లిగా ఉన్నట్లు గుర్తించారు. అయితే మృతుడు రైలు నుంచి జారిపడి చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే ఇన్చార్జీ కోటేశ్వరరావు తెలిపారు.