ధారూరు : వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ధారూరు పోలీసులు తెలిపారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిటెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహం చర్మం పూర్తిగా పొయి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మృతదేహాన్ని కుక్కలు తిని ఉంటాయని స్థానికులు, పోలీసులు బావిస్తున్నారు. 15 రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని అన్నారు. రాళ్ల చిట్టెంపల్లి గ్రామానికి చెందిన కావలి అంతయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసుకున్నామని ధారూరు ఎస్ఐ నరేందర్ తెలిపారు.