వికారాబాద్ : వాహనం ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పట్టణం అనంతగిరి గుట్టు సమీపలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం కలపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం (యాక్టివా)పై ధారూరులోని ఓ వివాహానికి వెళ్లి వస్తున్నాడు. వికారాబాద్ అనంతగిరి గుట్ట చివరి ఘాట్ వద్దకు రాగానే యాక్టివా వాహనాన్ని హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాక్టివాపై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు గమనించి వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.