ఆత్మకూరు(ఎం : మండలంలోని పారుపల్లి బిక్కేరు వాగులో నిర్మించిన చెక్‌డ్యాం వద్ద నిలిచిన నీటిలో అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మేడె మల్లేష్(30) ఈ నెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం చెక్‌డ్యాంలో నిలిచిన నీటిలో పారుపల్లి గ్రామానికి చెందిన రైతులు చేపలు పడుతుండగా మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచార అందించారు. మృతుని తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్సై మధు తెలిపారు.