ఒక యువతిపై అత్యాచారం చేసి, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన బీజేపీ నేతపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘోరం వెలుగు చూసింది. బలియాలో బీజేపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్న రంజిత్ మౌర్య ఈ నీచానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని సదరు యువతి పోలీసులకు తెలియజేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బలియాలో నివసిస్తున్న 26 ఏళ్ల యువతిపై రంజిత్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురువారం నాడు ఆమె నివసించే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఆమెను బలాత్కరించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు.
సదరు యువతిని బీజేపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని చేస్తానని ఆశజూపాడు. అయినా సరే ఆ యువతి వినకపోవడంతో ఆమెను బూతులు తిడుతూ బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో రంజిత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.