ఇబ్రహీంపట్నరంరూరల్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని తులేకలాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య(46) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం కందుకూరు తాసిల్దార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేయించి డబ్బులు తీసుకుని మోటర్‌సైకిల్‌పై తిరిగి వస్తుండగా తులేకలాన్ గ్రామం సమీపంలో అటవిప్రాంతంలో ఓ చెట్టును ఢీకొనడంతో గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 10గంటలైనా తండ్రి ఇంటికి చేరుకోకపోవడంతో మధుకుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.
మొబైల్ ట్రేజింగ్ ద్వారా జంగయ్య లొకేషన్‌ను గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని గమనించగా అప్పటికే మృతిచెందాడు. ఈ మేరకు కుమారుడు మధుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.