షాబాద్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దవేడు గ్రామానికి చెందిన ఎనిమిదిమంది శుక్రవారం ఉదయం ఓ ఆటోలో పెళ్లి బట్టలు కొనుగోలు చేసేందుకు షాద్‌నగర్‌కు వెళ్తుండగా షాబాద్ మోడల్ స్కూల్ ఆవరణలో రోడ్డుపై ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108లో షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.