హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్మెంట్లు ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నాంపల్లిలోని రెడ్‌హిల్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరంలో మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని, సుమారు 16-17 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు.