ముంబై, సెప్టెంబర్ 29: వాహన సంస్థ స్కోడా కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వచ్చేలా కార్ల ధరలను 1.2 శాతం వరకు సవరిస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికం కావడంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కార్ల ధరలు రూ.20 వేల వరకు అధికం కానున్నాయి. ప్రస్తుతం సంస్థ కైలాక్, స్లావియా, కుషక్, కొడిక్యూ, ఆక్టావియా ఆర్ఎస్, సూపర్బ్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.