కాచిగూడ : గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడలోని గోకుల్ధామ్ అపార్ట్మెంట్ కు చెందిన గౌరవ్గుప్త (32) ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా పొరుగు రాష్ట్రాల వారితో అన్లైన్లో గత కొన్ని రోజులుగా అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం రాత్రి ఇంట్లో సోదాలు చేయగా గౌరవ్గుప్త దగ్గర రూ.లక్ష రూపాయలు, సెల్ఫోన్ దొరికాయి. వాటిని కాచిగూడ పోలీసులు స్వాధీనం చేసుకొని గౌరవ్గుప్తను అరెస్ట్ చేసినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.