అమరావతి : ఏపీలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ( Couple ) మృతి చెందారు. సామర్లకోటకు చెందిన సత్యనారాయణ ( 45 ), అరుణకుమారి ( 40 ) ద్విచక్రవాహనంపై సొంత ఊరుకు వెళ్తుండగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద లారీ ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.